కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ లో బుధవారం పెను తుఫాను సంభవించింది. దినాజ్ పూర్ జిల్లా రాయ్ గంజ్ లో తుఫాను బీభత్సానికి 32మంది దుర్మరణం పాలయ్యారు. గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో పదిన్నరకు తుఫాను మొదలై ప్రాణాలు తీసేసింది. ఈ పెను తుపానుకు వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలది మంది నిరాశ్రయులయ్యారు. వేలది ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. రవాణా, సమాచార వ్యవస్థలు కుప్పకూలాయి. సహాయచర్యలు చేపట్టేందుకు కూడా అధికారయంత్రాంగానికి నానా పాట్లు పడాల్సిన తీవ్ర పరిస్థితి నెలకొంది. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంధ సంస్థలు రంగంలోకి దిగారు.