ఖమ్మం: వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి ఖమ్మం జిల్లాలలో జరుపనున్న ఓదార్పు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మల్లవరం నుంచి ఆయన నేరుగా వైరా వెళతారు.
వైరాలో కార్యక్రమాలు యథాతథం జరుగుతాయి. నాగులవంచ, పందిళ్లపల్లి, లచ్చగూడెం, రామకృష్ణాపురం తదితర గ్రామాల గుండా యాత్ర సాగనుంది. రాత్రికి ఖమ్మంలో బస చేస్తారు. రేపు జూలూరుపాడు నుంచి జగన్ పర్యటన యథాతథంగా జరుగుతుంది.