కష్టాల్లో విదేశీ సహాయ మంత్రి థరూర్

రాండిపూ కన్సార్టియం వాటాదారులు ఎవరనేది అడగవద్దని థరూర్ తనపై ఒత్తిడి తెచ్చారని ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఫ్రాంచైజీ అసలు యజమానులు ఎవరనేది ఇప్పటికీ సందేహమేనని ఆయన అన్నారు. ఫ్రాంచైజీల యజమానుల గురించి తెలుసుకోవాలని బాధ్యత తనపై ఉంటుందని ఆయన అన్నారు. ఫ్రాంచైజీలో పెట్టిన 75 కోట్ల రూపాయలు తనవేనని, తాను థరూర్ కు ప్రతినిధిని కానని సునంద పుష్కర్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. థరూర్ ను బర్తరఫ్ చేయాలని బిజెపి, సిపిఎం, తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నాయి. దీంతో శశి థరూర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.












Click it and Unblock the Notifications