న్యూఢిల్లీ: కొచ్చి జట్టుకు తాను అంబాసిడర్ కానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పష్టం చేశారు. కొచ్చి జ్టటుకు తాను అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన కూడా పెట్టలేదని, తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె స్పష్టం చేశారు.
యంగ్ ఉమెన్ అచీవర్ అవార్డును అందుకోవడానికి ఢిల్లీ వచ్చిన విద్యాబాలన్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లలిత్ మోడీ, శశి థరూర్ ల మధ్య నడుస్తున్న వివాదంపై మాట్లాడడానికి ఆమె నిరాకరించారు.