తెలంగాణ కాదంటే అంతర్యుద్ధమే: కెసిఆర్

ఇది కొంతమంది వెలిబుచ్చిన అభిప్రాయాలమీద వేసిన కమిటీయే తప్ప తెలంగాణ కావాలా? వద్దా? అని తేల్చే కమిటీ కాదని, ఇప్పుడు కొంతమంది వ్యక్తంచేస్తున్న వ్యతిరేకత నిజమా? కాదా? అని చూడటం వరకే దీని పని అని ఆయన అన్నారు. తెలంగాణ, సమైక్యవాదనలను పరిశీలించి 9వ తేదీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే సరైందే, దాని ప్రకారమే వెళ్లాలని కమిటీ చెబుతుందని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ఎంత జాప్యంచేస్తే అంత అసహజమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని అన్నారు. డిసెంబర్ 31 తర్వాత ఏం చేయాలనే విషయంపై వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓ పనికి మాలిన ఎంపీ ప్రేమలేఖలు రాసినట్లు గుర్తొచ్చినప్పుడల్లా నివేదికలు అందిస్తున్నారని లగడపాటి నుద్దేశించి అన్నారు. కన్సల్టెంట్లను పెట్టుకొని వారు రాసిచ్చే అడ్డమైన సమాచారాన్ని నివేదిక రూపంలో సంతకంపెట్టి అందిస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ వాదం బలహీనపడుతోందన్న వాదనలను కేసీఆర్ తోసిపుచ్చారు. జగన్, చంద్రబాబు పర్యటనల సమయంలో తెలంగాణలో ఇరాక్‌లోని పరిస్థితులు సృష్టిస్తున్నారని, తెలంగాణ వాదులందరినీ జైళ్లలో పెట్టి వీళ్లు పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కొత్తగూడెంలో జగన్ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని పోయినా దొంగ మీడియా దాన్ని దాచిపెడుతోందని ఆరోపించారు. ట్రిక్ ఫొటోగ్రఫీతో దొంగ ఫొటోతీసి జగన్‌మోహన్‌రెడ్డికి జనం వచ్చినట్లు చూపెడుతున్నారని ధ్వజమెత్తారు. తాను మొత్తం మీడియాను అనడంలేదని, దుర్మార్గం చేసేవాళ్లనే విమర్శిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications