మహేష్‌బాబుకు లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించిన ఏకైక నటి
గ్లామర్ ప్రపంచంలో ఏమైనా జరగవచ్చు. నిన్నటి వరకు హీరో పక్కన డ్యూయెట్లు పాడిన హీరోయిన్లు, రేపు అదే హీరోకు తల్లిగానో, అక్కగానో నటించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే, ఆమె ఒకే సినిమాలో మహేష్ బాబుకు లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ క్రేజీ బ్యూటీ మరెవరో కాదు.. బాలీవుడ్ భామ అమీషా పటేల్!
గ్రాండ్ వెల్ కం లభించింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బద్రి' సినిమాతో ఈమెను తెలుగు తెరకు పరిచయం చేశారు దర్శకుడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాలోనే పవన్ పక్కన 'సరయు'గా నటించి మెప్పించడంతో పాటు, సినిమా సూపర్ హిట్ కావడంతో అమీషాకు ఇక్కడ గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. బద్రి తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయిన ఈ అమ్మడు, నాలుగేళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో! ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన 'నాని' సినిమాలో అమీషా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా, మహేష్ బాబు కెరీర్‌లో ఒక ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది.

క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు
సినిమా ప్రారంభంలో మహేష్ బాబుకు లవర్‌గా కనిపించి, ఆ తర్వాత భార్యగా మారుతుంది. క్లైమాక్స్‌లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. మహేష్ బాబు మళ్లీ ఎనిమిదేళ్ల పిల్లాడిగా మారిపోతాడు. ఆ సీన్‌లో అమీషా పటేల్ ఆ చిన్న మహేష్ బాబుకు తల్లిగా కనిపిస్తుంది. అలా ఒకే కథలో మహేష్ బాబుకు జోడీగానూ, తల్లిగానూ నటించిన అరుదైన రికార్డును అమీషా సొంతం చేసుకుంది. మహేష్ బాబు తర్వాత అమీషా పటేల్ మరికొందరు స్టార్ హీరోలతోనూ నటించింది.
ఎన్టీఆర్‌తో 'నరసింహుడు',బాలయ్యతో 'పరమవీర చక్ర, ఆ తర్వాత 'ఆకతాయి' అనే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసి, అప్పటి నుండి తెలుగు తెరకు దూరమైంది. తెలుగులో అంతగా బిజీ కాలేకపోయినా, హిందీలో మాత్రం అమీషా ఒక రేంజ్‌లో దూసుకుపోయింది. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' ఆమె కెరీర్‌ను మలుపు తిప్పితే, ఇటీవలే వచ్చిన 'గదర్ 2'తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది.












Click it and Unblock the Notifications