సగం ప్రభుత్వాన్ని నడిపించబోతున్న AI-ప్రపంచంలో తొలిసారి..!

కృత్రిమ మేథ (AI) రాకతో ఆవిరైపోతున్న ఉద్యోగాలు, పుట్టుకొస్తున్న కొత్త ఉద్యోగాలు, ఆవిష్కరణలు.. ఇలా అన్నింటిలోనూ ఏఐ దూసుకుపోతోంది. ఇప్పుడు ఓ దేశంలో సగం ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి ఎఐ ఎదిగింది. ఈ మేరకు వచ్చే రెండేళ్లలో ఏఐ సాయంతో సగం ప్రభుత్వ కార్యకలాపాలను నడిపించాలని గల్ఫ్ దేశం యూఏఐ (UAE) సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచం నిజంగానే నివ్వెరపోతోంది.

యూఏఈ ప్రభుత్వం పాలనా నమూనాని మార్చి, రెండేళ్లలో సగం ప్రభుత్వ కార్యకలాపాలను ఏజెంటిక్ ఏఐకి (Agentic AI) బదిలీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఏఐ మార్పు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలపై, ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ నూతన నమూనాను ప్రకటించారు.

UAE Sets Two-Year Deadline To Power 50 Of Government Operations With Agentic AI
West Bengal AI Surveys: బెంగాల్ వాళ్లదే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..!
West Bengal AI Surveys: బెంగాల్ వాళ్లదే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..!

ఇందులో భాగంగా 50 శాతం ప్రభుత్వ విభాగాలు, సేవలు, కార్యకలాపాలు వచ్చే రెండేళ్లలో ఏఐ-ఆధారిత స్వయంప్రతిపత్త వ్యవస్థలకు మారతాయి. ఈ స్థాయిలో ఏఐ పాలనను అమలు చేస్తున్న తొలి ప్రపంచ దేశాలలో యూఏఈ నిలవనుంది. షేక్ మహమ్మద్ దృష్టిలో, కృత్రిమ మేధస్సు (AI) కేవలం ఒక సాధనం కాదు. అది విశ్లేషించి, నిర్ణయాలు తీసుకొని, పనులు నెరవేర్చి, నిజ సమయంలో మెరుగుపడుతుంది. ఏఐని "కార్యాచరణ భాగస్వామి" (executive partner)గా అభివర్ణిస్తూ, సేవా డెలివరీ, నిర్ణయాలు, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.

UAE Sets Two-Year Deadline To Power 50 Of Government Operations With Agentic AI
బ్యాంక్ అకౌంట్లకూ ఆంత్రోపిక్ ఏఐ ముప్పు ? నిర్మలా సీతారామన్ హెచ్చరికలు..!
బ్యాంక్ అకౌంట్లకూ ఆంత్రోపిక్ ఏఐ ముప్పు ? నిర్మలా సీతారామన్ హెచ్చరికలు..!

ఈ మార్పు రెండేళ్లలో జరుగుతుంది. స్వీకరణ వేగం, అమలు నాణ్యత, ఏఐ సామర్థ్యాలకు తగ్గట్టు పనిప్రవాహాల పునఃరూపకల్పన ఆధారంగా ప్రభుత్వ పనితీరు అంచనా వేస్తారు. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన ఏఐ-పౌర సేవకులను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏఐ శిక్షణ ఇస్తారు. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దీని పర్యవేక్షణ చేస్తారు. మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావి నేతృత్వంలోని కార్యదళం అమలు చేస్తుంది. సాంకేతిక పురోగతి ఉన్నా, యూఏఈ పాలన ప్రజలనే కేంద్రంగా చేసుకుంటుందని షేక్ మహమ్మద్ తెలిపారు. వేగవంతమైన, ప్రతిస్పందించే ప్రభావవంతమైన ప్రజా సేవలను అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+