ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజులకుపైగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికాలు యుద్ధం చేసుకుంటూనే ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యూఏఈ.. పాకిస్థాన్ కు కీలక వార్నింగ్ ఇచ్చింది. తమకు చెల్లించాల్సిన 2 బిలియన్ డాలర్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ లోన్ ను చెల్లించేందుకు పాకిస్థాన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం, ప్రపంచ దేశాల్లో చమురు కొరత నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం నెలకొని ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కు లోన్ రూపంలో ఇచ్చిన 2 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే తమకు తిరిగి చెల్లించాలని పాకిస్థాన్ ను డిమాండ్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ లో సేఫ్ డిపాజిట్ గా ఉన్న ఈ మొత్తాన్ని ఈ నెలాఖరు లోగా తిరిగి చెల్లించాలని యూఏఈ పేర్కొన్నట్లు సమాచారం.
ఇక గతంలో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు యూఏఈ ఈ సాయాన్ని అందించింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో భాగంగా పాకిస్థాన్ కు యూఏఈ ఈ నిధులను అందించింది. అయితే సాధారణంగా ప్రతి ఏటా ఈ రుణాన్ని పొడిగిస్తూ వస్తున్న యూఏఈ.. ఈ సారి మాత్రం వెంటనే చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ రుణాన్ని చెల్లించేందుకు పాకిస్థాన్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు పాకిస్థాన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనే పాకిస్థాన్ పై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ పై అసంతృప్తితోనే యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

యూఏఈ గతంలో సమకూర్చిన ఈ డిపాజిట్ పై పాకిస్థాన్ దాదాపు 6శాతం వడ్డీని సమకూరుస్తూ వస్తోంది. 2025 డిసెంబర్ నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే గడువును పొడిగిస్తూ వచ్చింది యూఏఈ. చివరకు ఏప్రిల్ 17 నాటికి గడువును ముగించింది. ఇక ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 21 బిలియన్ల విదేశీ మారక ద్రవ్యాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రుణాన్ని చెల్లించడం కారణంగా రాబోయే నెలల్లో పాకిస్థాన్ కు ఆర్థిక సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications