చెన్నై: శ్రీలంక సైనిక దాడిలో మరణించిన ఎల్టీటిఇ చీఫ్ ప్రభాకరన్ తల్లి పార్వతి శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైకి రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. మలేషియా నుంచి ఆమె చెన్నైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ఆమెను అధికారులు వెంటనే మలేషియాకు పంపించి వేశారు.
చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం పార్వతి కౌలాలంపూర్ నుంచి వచ్చింది. పోలీసులు ఆమెను అనుమతించలేదు. విమానాశ్రయం నుంచే ఆమెను వెనక్కి పంపారు. విమానాశ్రయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.