తిరుపతి: వేసవి సెలవులు కావడంతో తిరుమలలో రద్ద్దీ ఎక్కువైంది. ఆదివారం భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంది. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 29 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచివున్నారు. శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నేడు పుదుచ్చేరిలో వెంకన్న కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.
ఈ వేసవిలో అమెరికాలో కూడా శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. అనేక వివాదాలు ఉన్నా ఈ ఉత్సవాలను నిర్వహించాలన్న కృత నిశ్చయంతో చైర్మన్ ఆదికేశవులు నాయుడు, ఇవో కృష్ణారావు ఉన్నారు.