విశాఖలో పబ్ సంస్కృతిపై టిడిపి 'దాడి'

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నంలో విదేశీ సంస్కృతి నెలకొందని, సంఘ విద్రోహ శక్తులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితిని తక్షణం నివారించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం నాయకుడు దాడి వీరభద్రరావు అన్నారు. జల ఉద్యానవనంలో జరిగిన సమీక్ష మండలి (డీఆర్‌సీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో విదేశీ సంస్కృతి పెరుగుతోందన్నారు. కొంతమంది రాజకీయ ప్రముఖుల అండదండలతో ఏర్పాటైన పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవుతున్నాయన్నారు.

ఈ తరహా పబ్‌లకు ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇటీవల ఏర్పాటైన మసాజ్‌ క్లబ్‌ల వల్ల కూడా భావితరాల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయన్నారు. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియడం లేదన్నారు. కేఫ్‌ల పేరిట హుక్కా కాల్చే ఆరు కేంద్రాలు ఏర్పడ్డాయన్నారు. ఇవన్నీ పోలీసులకు తెలిసే జరుగుతున్నాయని ఆరోపించారు. యువతీ యువకులపై చెడు ప్రభావం కలిగించే పబ్ ‌లు, మసాజ్‌ కేంద్రాలు, కేఫ్ ‌లపై ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. పోలీసు అధికారులు దృష్టి పెట్టి వీటితోపాటు జూద గృహాలను కూడా మూసివేయాలన్నారు. దీనిపై మంత్రి కన్నా స్పందిస్తూ ఆదివారం ఉదయం 10.30 గంటలకు సర్క్యూట్‌ హౌస్‌లో పోలీస్‌ కమిషనర్‌, డీఐజీలతో ప్రత్యేకంగా సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+