గుంటూరు: గుంటూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నడుస్తున్న కూలీలపైకి ఆర్టీసి బస్సు దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడిన వారిని అస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలో జరిగింది.
పనుల నుంచి మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న కూలీలపైకి అదుపు తప్పి ఆర్టీసి బస్సు దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.