విశాఖపట్నం: మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ లో మరో దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు రైల్వై ట్రాక్ క్లిప్ లను తొలగించారు. దీంతో ఛత్తీస్ గడ్ లోని కోరండల్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నాల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన మూడు బోగీలు బోల్తా పడ్డాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.
విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి ఇనుము సరఫరా కూడా ఆగిపోయింది. ట్రాక్ ను మరమ్మతు చేయడానికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. దీనివల్ల రోజుకు రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.