అరకులోయకు ఆర్టీసీ కొత్త ప్యాకేజిలు

వేసవిలో అరకువ్యాలీని సందర్శించేందుకు వీలుగా ఆర్టీసీ కొత్త ప్యాకేజీలను రూపొందిస్తోంది. పర్యటన రెండు మూడు రోజుల పాటు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం తీసుకువెళతారు. అక్కడ కైలాసగిరి, భీమిలి, రామకృష్ణా బీచ్ చూపించిన తర్వాత కిరండల్ ఎక్స్‌ప్రెస్‌లో అరకులోయ తీసుకువెళతారు. ఆ రాత్రి అరకులో ఉంచుతారు. తిరుగు ప్రయాణంలో బొర్రా గుహలు చూపిస్తారు. ప్రయాణికులకు భోజన వసతి, డార్మెటరీ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.












Click it and Unblock the Notifications