జూన్ లో రోశయ్య మంత్రివర్గ విస్తరణ

ప్రస్తుతం మంత్రివర్గంలో 34 మంది సభ్యులున్నారు. ఇంకా 10మందిని కొత్తగా తీసుకునే వీలుంది. తనకు సంబంధించిన సీనియర్ శాసనసభ్యులను పది మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 294 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 44కు మించి ఉండకూడదు. దివంగత వైఎస్ 2004లో అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించారు. అప్పుడు సీఎంతో కలిసి మంత్రివర్గ సభ్యుల సంఖ్య 40. ఇప్పుడు గరిష్ఠస్థాయిలో 44 మందికి చోటు కల్పించేందుకు రోశయ్య సిద్ధమయ్యారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రోశయ్య ఒక్కరికే శాసనమండలి నుంచి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీలకు కూడా రోశయ్య మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చునని ఆశపడుతున్నారు.












Click it and Unblock the Notifications