విభజనపై నావి రెండు వైఖరులు: బాబు

రాష్ట్రంలో తెలంగాణ, సమైక్యవాద ఉద్యమాలు వచ్చాయని, అందుకే ఇరు ప్రాంతాల నాయకులకు స్వేచ్ఛనిచ్చానని, దానివల్లనే శ్రీకృష్ణ కమిటీకి ఇరు ప్రాంతాల నాయకులు తమ తమ ప్రజల అభిప్రాయాల మేరకు నివేదికలిచ్చారని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్లు అని, ఈ రెండు ప్రాంతాలవారు ఆదరించడం వల్లే తొమ్మిదేళ్లపాటు సీఎంగా ఉండగలిగానని, ఏ ప్రాంతం వారి మనోభావాలకు అనుగుణంగా అక్కడి నాయకులు పని చేయడానికి స్వేచ్ఛనిచ్చానని, ఆయా ప్రాంతాల ప్రజల వాణి ప్రకారం వెళ్లాలని నాయకులకు చెప్పానని, పార్టీగా ఏ వైఖరీ మేం తీసుకోలేదని ఆయన వివరించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలను ప్రస్తావించే వీలు లేకుండా ప్రజాపథాన్ని ప్రభుత్వం ఒక తంతులా మార్చిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications