నాపై విచారణ జరిపించండి: థరూర్

Shashi Tharoor
న్యూఢిల్లీ: ఐపియల్ కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో తనపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి శశి థరూర్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కోరారు. ఆయన మంగళవారం ప్రధానిని కలిశారు. తాను అనైతికమైందేమీ చేయలేదని, చట్టవిరుద్దమైంది కూడా చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణల మీద సమగ్ర విచారణ జరిపించాలని తాను ప్రధానిని కోరారని థరూర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను క్లీన్ గా బయట పడదలుచుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పారు. సంబంధిత అంశాలపై లోతుగా విచారణ జరపడానికి తన రాజీనామా ప్రధానికి, తన మంత్రివర్గ సహచరులకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. భారత రాజకీయాలకు తాను కొత్తవాడినని, అయితే చాలా కాలంగా ప్రజాసేవలో ఉన్నానని, ఇంత వరకు తనపై ఏ విధమైన ఆరోపణలు లేవని ఆయన అన్నారు. తాను సుదీర్ఘమైన అంతర్జాతీయ కెరీర్ తర్వాత భారత్ వచ్చానని, కేరళకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.

ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో ప్రభుత్వంలో, పార్టీలో పనిచేయడం తనకు గర్వకారణమని ఆయన చెప్పారు. శశి థరూర్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+