ర్యాలీలో స్పృహ తప్పిన గడ్కరీ

అధిక ధరలకు వ్యతిరేకంగా బిజెపి సభ్యులు పార్లమెంటు నుంచి వాకౌట్ చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బిజెపి నాయకులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, మురళీ మనోహర్ జోషి, అద్వానీ, ఎం వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు వంద నుంచి 200 శాతం పెరిగాయని అద్వానీ విమర్శించారు. నిర్వహణ లోపం వల్ల, అవినీతి వల్ల ధరలు పెరిగాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications