తెలంగాణకు రాజకీయ పరిష్కారం: నారాయణ

Narayana
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు విడిపోవాలని కోరుకుంటున్నారని, అందువల్ల రాజకీయ పరిష్కారం కనుక్కుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిపిఐ శ్రీకృష్ణ కమిటీకి నివేదించింది. రాష్ట్రంలో ఏ ప్రాం తంలో ఎంత అభివృద్ధి జరిగిందని గణాంకాలు తీయడం కన్నా రాజకీయ పరిష్కారం చూడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఈమేరకు ఆయన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో కలిసి శ్రీకృష్ణ కమిటీతో రాష్ట్ర విభజన అంశంపై గురువారం సాయంత్రం మాట్లాడారు. 1969లో తెలంగాణ, 1972లో జైఆంధ్రా ఉద్యమాలకు వ్యతిరేకంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సిపిఐ పోరాడినట్లు నారాయణ తెలిపారు. ఆ పోరాటంవలన వేర్పాటువాదం సిపిఐ కార్యాలయాలపై దాడులు జరిపినట్లు ఆయన చెప్పారు.

2000 సంవత్సరంలో తెలంగాణ వెనుకబాటును పార్టీ గుర్తించిందన్నారు. 610 జీవో అమలు, 10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ప్రాంతీయ మండళ్ళ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి చేసి ప్రజల విశ్వాసం చూరగొనాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు పార్టీ ప్రతిపాదించిందన్నారు. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిర్లక్ష్యం చేసిందని అందుకోసమే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమని ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి సిపిఐ మద్దతిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలు కలిసి ఉన్నారని, ఇప్పుడు కూడా కలిసే విడిపోవాలని నారాయణ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజలను సంతృప్తిపరిచేందుకు ఏమైనా అవకాశముందా అని శ్రీకృష్ణ కమిటీ తమను ప్రశ్నించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజానీకంలో ఏ రకమైన విశ్వాసం ఎక్కువ తీవ్రత కలిగివుంది, అలాగే తక్కువ తీవ్రత కలిగివున్న అంశాలను గుర్తించి ముందుకు పోవాల్సిన అవసరముందని కమిటీ అభిప్రాయపడినట్లు నారాయణ చెప్పారు. విభజన విషయంపై రెంవడ ఎస్సార్సీ అవసరమా అని కమిటీ తమను ప్రశ్నించిందన్నారు. రెండవ ఎస్సార్సీ తేనెతుట్టేలాంటిదని ఇప్పుడు దాన్ని ముట్టుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుందని, ఇప్పుడు రెండవ ఎస్సార్సీ అవసరంలేదని కమిటీకి చెప్పినట్లు నారాయణ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+