తెలంగాణలోనూ సమైక్యవాదులు: చిరు

ప్రజలు ఎప్పూడూ నిర్దిష్టమైన ఆలోచనలతోనే ఉంటారని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు, నాయకత్వాలే తప్పటడుగులు వేస్తుం టాయని తెలిపారు. పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించేటప్పుడు ముంపుప్రాంతాలుం డటం సహజమని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలో పడేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీరి ప్రయత్నాలు ఇక సాగవని చిరంజీవి అన్నారు. రాష్ట్ర ప్రజలు తనను అన్ని విధాలా ఆదరిస్తున్నారని, ఎన్నికల ఫలితాలలో ఈవిఎంలపై అనుమానంగా ఉందన్నారు. రాజకీయాలలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పడూ ఇబ్బంది పడిన సందర్భాలు లేవని, సినిమాలలో మరో ఐదారేళ్ళు మాత్రమే ఉంటానని, ప్రజాసేవకు రిటైర్మెంటు ఉండదని అన్నారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి లేదని, ఆ పని రామ్ చరణ్‌కు అప్పగించానని చెప్పారు. సమయముంటే సినిమాల గురించి అలోచిస్తానని తన మనసులోని మాటను చిరంజీవి బయటపెట్టారు.












Click it and Unblock the Notifications