వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టు నాయకుడు ఉమేష్ లొంగుబాటు

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్‌: మావోయిస్టు గుజరాత్‌ రీజనల్‌ కమిటీ సభ్యుడు కసుమ కట్టయ్య అలియాస్‌ ఉమేష్‌ బుధవారం వరంగల్‌ జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయాడు. ఉమేష్‌ స్వస్థలం నర్సంపేట మండలం ముత్తొజీగూడెం. 27 ఏళ్లగా మావోయిస్టు పార్టీలో ఇతను కీలకపాత్ర పోషించాడు. కాగా అనారోగ్య కారణాల వల్ల ఆయన లొంగిపోయినట్టు తెలిసింది.

ఇలా ఉండగా ఈ జిల్లాలో జరిగిన మరో సంఘటన వివరాలు: ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా మాదిగలు మరో ఉద్యమానికి సన్నద్ధులు కావాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. హన్మకొండలోని మయూరి గార్డెన్‌ లో ఎమ్మార్పీఎస్‌ జిల్లా బాధ్యుడు కుండూరి రాజ ఎల్లయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు, ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ ప్రధాన అడ్డంకిగా తయారైందని ఆరోపించారు.

వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి రోశయ్య చిత్తశుద్ధి కనబరచడం లేదని విమర్శించారు. వర్గీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో రోశయ్య ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉషా మెహ్రా కమిషన్‌ నివేదిక సమర్పించి, రెండు సంవత్సరాలైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఎమ్మార్పీఎస్‌ మం డల, జిల్లా కమిటీల ఎన్నికలను ఈ నెల లోనే పూర్తి చేయాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X