హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా వివిధ సంఘాలతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నేడు సమావేశం కానుంది. ప్రధానంగా ఆరు సంఘాలతో కమిటీ సభ్యులు భేటీ అవుతారు. ఆంధ్ర మేధావుల వేదిక, తెలంగాణ జాగృతి సంస్థ, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ మేధావుల వేదిక, 1969 తెలంగాణ ఉద్యమ నిర్మాతల సంఘం, తెలంగాణ అభివృద్ధి ఫోరం ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించారు. గురువారం ఉదయం 10 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలో కమిటీ సమావేశమవనుంది. దీనికి చైర్మన్ శ్రీకృష్ణ అధ్యక్షత వహిస్తారు. కమిటీ సభ్యులతోపాటు 'ఇంటర్ స్టేట్ కౌన్సిల్'(ఐఎస్‌సీ) ప్రత్యేక కార్యదర్శి, సలహాదారు శశిప్రకాశ్ కూడా హాజరుకానున్నారు. 11 గంటలకు ఆంధ్ర మేధావుల వేదిక, 12.15 గంటలకు తెలంగాణ జాగృతి ప్రతినిధులతో కమిటీ భేటీ అవుతుంది.