శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు, ఇద్దరు సైనికులు మరణించారు. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారు జామున సైనికులు రఫియాబాద్ గ్రామాన్ని సైనికులు చుట్టుముట్టారు. మిలిటెంట్లు ఆశ్రయం తీసుకున్న ఇంటి కోసం గాలించారు.
సైనికులను గమనించి మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. దాంతో సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు, ఇద్దరు జవాన్లు మరణించారు. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.