హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై వివక్షను చెప్పాం: సింగిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Singidi
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పడిన పరిస్థితులపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ వద్ద గురువారం సింగడి తెలంగాణ రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్‌ సంగిశెట్టి శ్రీనివాస్‌, నాగభూషణచారి, స్కైబాబా, సూర్యనాయక్‌, రవీందర్‌ తదితరులు తమ వాదనలు వినిపించారు. తెలంగాణ భాష, చరిత్రను వక్రీకరించి, ధ్వంసం చేస్తున్న విషయాలను ఆధారాలతో వివరించినట్లు శ్రీకృష్ణ కమిటీతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాద్‌ రాజధాని తెలంగాణ ప్రజలదే ఎలా అవుతుందో తెలియజేశామన్నారు. గత 200 ఏళ్లుగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు వేర్వేరుగా ఉంటున్నాయని, హైదరాబాద్‌లో భవనాలు, విద్యాసంస్థలు నిజాం కాలంలో ఏ విధంగా నిర్మించారో చెప్పినట్లు వార తెలిపారు.

ఇరు ప్రాంతాల ప్రజలు మాట్లాడేది తెలుగే అయినప్పటికీ, భాషలో వివక్ష ఎలా ఉంటుందని జస్టిస్‌ శ్రీకృష్ణ అడిగారు. భాష, యాస, పదాల్లో తేడాలున్నాయని, తెలంగాణ భాషపై వివక్ష ఎలా జరిగిందో ఆధారాలతో సహా చెప్పామని వారన్నారు. తెలంగాణ రచయితలకు సంబంధించిన అంశాలు పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరినా పట్టించుకోలేదని చెప్పినట్లు సింగడి ప్రతినిదులు అన్నారు. ఎంఐఎం మినహా తెలంగాణలోని 15 శాతం ముస్లింలు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. తెలంగాణ ముస్లింలకు ఎంఐఎం ప్రతినిధి కాదని చెప్పామని అన్నారు. సినీ పరిశ్రమ మొత్తం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి చేతుల్లో ఉన్నందున సినిమాల్లో విలన్లకు, జోకర్లకు తెలంగాణ భాష అంటగడుతూ రౌడీల భాషగా చిత్రీకరిస్తున్నారని తెలియజేశామని చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో అట్లతద్దె, అల్లూరి సీతారామరాజు కథలు చేర్చారని, కానీ బతుకమ్మ, కొమురం భీమ్‌ గురించి మాత్రం ఉండదని ఆవేదన వ్యక్తంచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X