వైయస్ జగన్ సాక్షిపై విహెచ్ గరం

సంక్షేమ పథకాలకు వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నా నిధుల కోత తప్పేది కాదని ఆయన అన్నారు. రేషన్ కార్డుల తొలగింపు నిర్ణయాన్ని వైయస్ రాజశేఖర రెడ్డే తీసుకున్నారు కదా అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ ఏర్పాటు చేసుకున్న మంత్రి వర్గంతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య పని చేస్తున్నారని, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను వైయస్ అనుయాయులు వ్యతిరేకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మంత్రులు సహకరిస్తున్నారా, లేదా అనేది ముఖ్యమంత్రే చెప్పాలని ఆయన అన్నారు. రాజ్యసభ సీటు కోసమే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన జనగణన కార్యక్రమాన్ని ఆయన హర్షించారు.












Click it and Unblock the Notifications