సిట్ ముందు హాజరైన ప్రవీణ్ తొగాడియా

సిట్ కార్యాలయానికి రావడానికి ముందు తొగాడియా అహ్మదాబాదులోని మహాలక్ష్మీ దేవాలయాన్ని, గాంధీనగర్ లోని పంచదేవ్ ఆలయాన్ని సందర్శించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ హత్యకు సంబంధించిన సంఘటనలో ఆయన భార్య జాకియా జాఫ్రీ చేసిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 19వ తేదీన తమ ముందు హాజరు కావాలని తొగాడియాకు సిట్ సమన్లు జారీ చేసింది. ఆయితే ఆయన ఆ రోజు హాజరు కాలేదు.
ఫిర్యాదు ప్రతి అందకపోవడం వల్లనే తాను ఆ రోజు రాలేకపోయానని తొగాడియా సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను పదే పదే అడిగినా ఆ ప్రతిని తనకు ఇవ్వలేదని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టుపై ఉన్న గౌరవంతో తాను సిట్ ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దేశంలో తాను హిందువును కావడమే నేరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications