వైష్ణవి హత్యతో సంబంధలేదు: గౌడ్

Naga Vaishnavi
విజయవాడ: వైష్ణవి హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని, నేరస్ధులెవరో త్వరలో తెలుస్తుందని పోలీసులు కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ప్రధాన నిందితుడు వెంకట్రావుగౌడ్‌ ఆరోపించాడు. అహ్మదాబాద్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ వెంకట్రావు, మరో నిందితుడు మోర్ల శ్రీనివాసరావుకు నార్కో పరీక్షలు చేయడానికి నిరాకరించడంతో పోలీసులు ఆదివారం వారిని తిరిగి నగరానికి తీసుకొచ్చారు. ఉదయం 8.30 గంటలకు బందోబస్తు నడుమ వారిని నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో తీసుకొచ్చారు. రైలు దిగిన తర్వాత వెంకట్రావు మీడియాతో మాట్లాడేందుకు విఫలయత్నం చేశాడు.

పోలీసులు నెట్టుకుంటూ తీసుకెళుతున్నా కొన్ని విషయాలు చెప్పాడు. తనను ఒక్కసారి పోలీస్‌ కమిషనర్‌ వద్దకు తీసుకెళ్లి మాట్లాడే అవకాశం కల్పించాలని కోరాడు. వ్యవస్థలో లోపాల వల్లే తాను అరెస్టయ్యానని, ఒక్కసారి ఎఫ్ ఐఆర్‌ కడితే మూడు నెలలైనా మంచీచెడూ చూడడంలేదని చెప్పాడు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని వాపోయాడు. నార్కో ఎనాలసిస్‌, బ్రెయిన్‌ మ్యాపింగ్‌, లైడిటెక్టర్‌ వంటి ఏ పరీక్షలకైనా తాను సిద్ధపడ్డానని తెలిపాడు. నార్కో పరీక్షతో తన సమస్య పరిష్కారమవుతుందని భావించినా అనుకోకుండా అది ఆగిపోయిందని చెప్పాడు. ఈ కేసులో అసలు ముద్దాయిలు వేరే ఉన్నారని, వారు దొరుకుతారని చెప్పాడు. మీడియాతో పది నిమిషాలు మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+