తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే: తెలంగాణ టిడిపి

అష్ట సూత్ర పథకం, ఆరు సూత్రాల పథకం వంటివేవీ అమలు కాలేదని, తెలంగాణకు రాజ్యాంగ బద్దంగా కల్పించిన గ్యారంటీలు కూడా అమలుకు నోచుకులేదని, అందువల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందేనని తాము శ్రీకృష్ణ కమిటీకి చెప్పినట్లు విజయరామారావు చెప్పారు. ఆర్టికల్ 3 కింద కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించడం ద్వారా చాలా సులభంగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చునని, అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పెద్ద కష్టమేమీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైందని డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోయిందని తాము ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications