జగన్ ఇష్యూ: మీడియాపై విహెచ్ గుర్రు

V Hanumantha Rao
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంలో కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మీడియాపై విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ ను నాయకుడిని చేస్తోంది మీడియానే అని ఆయన విరుచుకుపడ్డారు. అది దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రభుత్వంపై జగన్‌ చేస్తున్న విమర్శల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు - అనవసరంగా మీడియా ఆయన్ను నాయకుడిని చేస్తోదని, తాను ఆయన గురించి మాట్లాడనని, అతను తన మిత్రుని కొడుకు మాత్రమేనని జగన్‌ నాయకుడా కాదా అన్నది ప్రజలు తేలుస్తారని, దాని గురించి నేనేమీ చెప్పనని విహెచ్ అన్నారు. ఏ అంశం వచ్చినా జగన్‌ గురించే మాట్లాడుతున్నారని, మీరేమైనా పేటెంట్‌ తీసుకున్నారా చెప్పండని, చెబితే తానేమీ అడగనని, ఇది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.

సంక్షేమ పథకాల అమలు తీరును చూసి తలవంచుకోవాల్సి వస్తోందన్న జగన్‌ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు "తలవంచుకోవాలా? వద్దా? అనే దానికి ప్రతి ఒక్కరికీ సొంత కొలమానాలు ఉంటాయ" అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అదే పనిగా కోత పెడుతోందన్న విమర్శలను తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉందని, వైఎస్‌ ఉన్నా ఇదే పని చేసే వారని అభిప్రాయపడ్డారు. రోశయ్య ప్రభుత్వ పనితీరు గురించి కాంగ్రెస్‌ ఎంపీకి చెందిన ఓ పత్రిక వ్యతిరేక వార్తలు రాస్తున్న విషయం గురించి అడిగినప్పుడు "ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను చదవొద్దని వైఎస్‌ ఇది వరకే చెప్పారు" అని గుర్తుచేశారు. అలాగని తాను పత్రికను చదవొద్దని చెప్పడంలేదని, వైఎస్‌ చేసిన వ్యాఖ్యలను మాత్రమే గుర్తుచేస్తున్నానన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి రెండు పథకాలు సరిగా అమలు కావడంలేదని తాను బహిరంగంగా వ్యాఖ్యానిస్తే సోనియా పిలిచి ఏదైనా ఉంటే తన వద్ద చెప్పాలి తప్పితే బహిరంగంగా కాదని సూచించారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+