చంద్రబాబు నీచాతినీచుడు: గాలి

Gali Janardhan Reddy
అనంతపురం/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నీచాతినీచుడని కర్నాటక మంత్రి, ఓబుళాపబురం గనుల యజమాని గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన సోమవారం చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తన గనుల తవ్వకాలను అడ్డుకోవడానికి చంద్రబాబు నీచమైన పనికి ఒడి గడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, దేవెగౌడ తనకు ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు తనకు మద్దతిచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య తనను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారని, తనపై కక్ష సాధిస్తున్నారని ఆయన అన్నారు. తనపై అసత్యప్రచారం సాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గాలి జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి విడివిడిగా విరుచుకుపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి ఓ గంజాయి మొక్క అని, ఆ గంజాయి మొక్కను ఏరివేసే పని చంద్రబాబు చేపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. బ్రాహ్మణి స్టీల్ నిర్మాణానికి ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉందని, దాన్ని పూర్తి చేయకపోతే గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపుతామని ఆయన అన్నారు. వైయస్ సహకారంతో గాలి జనార్దన్ రెడ్డి అనంతపురం ప్రజలను దోచుకున్నారని, దాంట్లో కొద్ది మొత్తాన్ని సామూహిక వివాహాలకు ఖర్చు చేసి పాపాలు కడుక్కుందామని అనుకుంటున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబుపై గాలి జనార్దన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ప్రజలే సమాధానం చెప్తారని ఆయన అన్నారు. గాలిపై చర్యలు తీసుకోవడానికి రోశయ్య నిజాయితీగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రోశయ్య, ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి అండదండలతో గాలి జనార్దన్ రెడ్డి తన అక్రమాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+