ఫ్యాన్స్ వేలం వెర్రి, చిరంజీవి అలక

వద్దువద్దన్నా వినకుండా చల్లడంతో పూరెమ్మలు కళ్లలో పడ్డాయి. దీంతో కినుక వహించిన చిరంజీవి బస్సు లోపలకు వెళ్లిపోయారు. తర్వాతి గ్రామమైన వరహాపురానికి కాన్వాయ్ తరలింది. చిరంజీవి బస్సులోనికి వెళ్లి కనిపించకుండానే వెళ్లిపోతారా? అనుకున్న జనం, కాన్వాయ్ లోని ఒక సెక్యూరిటీ వాహనాన్ని అడ్డగించారు. ప్రజారాజ్యం బ్యానర్లు చించివేసి ఆందోళనకు ఉపక్రమించారు. వరహాపురం చేరుకున్నాక చిరంజీవికి ఈ విషయం తెలిసింది. అయినా ఆగకుండా వేమూరు చేరుకున్నారు. అక్కడ్నుంచే కుచ్చెళ్లపాడు కార్యకర్తలకు కబురు పంపారు. పూల కారణంగానే ఇబ్బందిపడి బస్సులోపలకు వెళ్లాల్సి వచ్చిందని, ఏమీ అనుకోవద్దని అన్న చెప్పారని వర్తమానం పంపారు. శాంతించిన గ్రామస్తులు వాహనాన్ని వదిలారు.












Click it and Unblock the Notifications