చంద్రబాబుతో ఎర్రబెల్లి సమావేశం

జగన్ యాత్రను ఎందుకు అడ్డుకుంటామని ప్రకటన చేయాల్సి వచ్చిందనే విషయంపై దయాకర రావు చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. మూడు పేజీల రాతపూర్వక వివరణను దయాకర్ రావు చంద్రబాబుకు సమర్పించారు. తెలంగాణకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అన్యాయం దృష్ట్యా జగన్ ను అడ్డుకోవాల్సి వస్తోందని ఆయన చెప్పినట్లు సమాచారం. నిజానికి, దయాకర రావు హరికృష్ణ బహిరంగ లేఖకు బహిరంగ లేఖ ద్వారానే సమాధానం ఇవ్వడానికి సోమవారమే సిద్ధపడ్డారు. అయితే, కొంత మంది సీనియర్ నాయకులు నచ్చజెప్పడంతో ఆయన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.












Click it and Unblock the Notifications