హైదరాబాద్: హైదరాబాదులో మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. గణేష్ ట్రావెల్స్ కు చెందిన టూరిస్టు బస్సు రోడ్డు దాటుతున్న కానిస్టేబుళ్లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటన హైదరాబాదులోని లక్డికాపూల్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో చంద్రారెడ్డి అనే కానిస్టేబుల్ మృతి చెందగా, వెంకటేశ్వర్లు అనే మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేశ్వర్లును సమీపంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్చారు.
ఇద్దరు కానిస్టేబుళ్లు విజయవాడకు చెందినవారు. క్యాష్ సెక్యూరిటీగా హైదరాబాద్ వచ్చారు. మంగళవారం ఉదయం టిఫిన్ చేసి రోడ్డు దాటుతుండగా టూరిస్టు బస్సు కాలయముడిలా దూసుకొచ్చింది.