జగన్ తెలంగాణ యాత్ర వాయిదా

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణ యాత్ర వాయిదా పడింది. ఆయన ఈ నెల 28వ తేదీ నుంచి వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. రాష్ట్రంలోని కోస్తా తీరాన్ని తుఫాను తాకడంతో తన పర్యటనను వాయిదా వేసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన తండ్రి మృతితో దిగ్భ్రాంతికి గురై షాక్ తో మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్ర పేర వరంగల్ జిల్లాలో పర్యటించాలని అనుకున్నారు.

జగన్ వరంగల్ పర్యటనపై తీవ్ర వివాదం కూడా చెలరేగుతూ వస్తోంది. వైయస్ జగన్ పర్యటనను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ప్రకటన ఆ పార్టీలో వివాదానికి కారణమైంది. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటనను ఆ పార్టీ నాయకుడు హరికృష్ణ వ్యతిరేకించారు. అలాగే, తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి జగన్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించింది. విద్యార్థి సంఘాల జెఎసి కూడా ఆయన పర్యటనను అడ్డుకుంటామని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+