ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: చంద్రబాబు

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సర్వం నష్టంపోయిన జాలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. వారికి నెల బియ్యంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం ముందుగానే పొగాకు కొనుగోలు చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
అంతకు ముందు ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పటిష్టత, అభివృద్దిపై ఆయన చర్చించారు. అనంతరం 'లైలా' తుపాను తాకిడికి అల్లకల్లోలమైన ప్రకాశంజిల్లాను సందర్శించేందుకు బయలుదేరి వచ్చారు.












Click it and Unblock the Notifications