హైదరాబాద్: వైఎస్ ఆర్ ఆడిటోరియంలో మంత్రి మాణిక్య వరప్రసాద్ పదవ తరగతి పరీక్షా ఫలితాల సిడిని విడుదల చేశారు. 81.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 92.65 శాతంతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో, 71.79 శాతంతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించి పైచేయిగా నిలిచారు. బాలురు 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోల్చితే ఉత్తీర్ణ శాతం పెరిగింది. గత ఏడాది ఉత్తీర్ణత 78.83 శాతం మాత్రమే. జూలై 24 నుంచి 27 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.