పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ ప్రెస్

న్యూఢిల్లీ నుంచి గౌహతికి వెళ్తుండగా మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని తూర్పు మధ్య రైల్వే సమాచార పౌర సంబంధాల ప్రధానాధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ట్రాక్ పై పేలుడు శబ్దం వినిపించగానే డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేశాడని, పేలుడే రైలు పట్టాలు తప్పడానికి కారణమై ఉండవచ్చునని ఆయన అన్నారు. దీని వెనక కుట్ర ఉండవచ్చునని ఆయన అన్నారు. అయితే ఇందులో మావోయిస్టుల హస్తం లేదని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications