మహబూబాబాద్ రైల్వే స్టేషనులో యుద్ధ వాతావరణం

Telangana
వరంగల్: వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ రైల్వే స్టేషనులో శుక్రవారం యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. రైల్వే స్టేషను నుంచి ఆందోళనకారులను వెళ్లగొట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారంపై రాళ్లు నిండిపోయాయి. వైయస్ జగన్ ప్రయాణిస్తున్న ఇంటర్ సిటీ రైలు ఇక్కడికే చేరుకోవాల్సి ఉంది.

ఫ్లాట్ ఫారం మీది నుంచి ప్రయాణికులంతా వెళ్లిపోయారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలు కూడా బయటకు రావడం లేదు. ఆందోళనకారులు పెద్ద యెత్తున బాణసంచా పేలుస్తున్నారు. దీంతో బాంబులు పేలుతున్న చప్పుడు వినిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జగన్ యాత్రను అడ్డుకుని తీరుతామని పట్టుదలతో తెలంగాణవాదులు ఉన్నారు. పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. పరిస్థితి పోలీసుల అదుపు దాటి పోయినట్లు అనిపిస్తోంది. కాంగ్రెసు నాయకులపై రాళ్లు వేయడం ప్రారంభించడంతో వాతావరణం వేడెక్కుతూ వచ్చింది.

తెలంగాణవాదులు రైల్వే స్టేషనుకు ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పరిస్థితి పోలీసుల చేతికి చిక్కడం లేదు. పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. రబ్బరు బుల్లెట్లు వదిలారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వాస్తవానికి జగన్ ఉదయం 11 గంటలకే మహబూబాబాద్ రైల్వే స్టేషనుకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆటంకాలు కల్పిస్తుండడంతో ఆలస్యం అయింది. జగన్ కు స్వాగతం చెప్పడానికి వచ్చిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా గాయపడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+