జగన్ పై తగిన సమయంలో సరైన చర్య: ప్రణబ్

ఓదార్పు యాత్ర చేపట్టవద్దని పార్టీ జగన్ కు స్పష్టంగా చెప్పిందని, అయినా జగన్ వినలేదని, కాంగ్రెసు కార్యకర్తగా పార్టీ సూచనను జగన్ శిరసా వహించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా జగన్ తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం జరిగిన పార్టీ కోర్ కమిటీలో జగన్ తీరుపై చర్చించినట్లు తెలిసింది. ఆ చర్చల సారాంశం మేరకే ప్రణబ్ ముఖర్జీ జగన్ పై మీడియా ముందు మాట్లాడినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications