కొనసాగుతున్న తెలంగాణ బంద్: అరెస్టులు

బంద్ కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి, తెలుగుదేశం తెలంగాణ ఫోరం మద్దతిచ్చాయి. మహబూబ్ నగర్, నల్లగొండల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. నిజామాబాద్, మెదక్, తదితర జిల్లాల్లో బస్సు డిపోల ముందు బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వందల సంఖ్యలో ఈ అరెస్టులు జరిగాయి. మెదక్ బస్సు డిపో వద్ద తెరాస నాయకుడు హరీష్ రావు, సిరిసిల్ల డిపో వద్ద మరో నేత కెటి రామారావు బైఠాయించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆందోళనకారులు సికింద్రాబాద్ ఎక్స్ ప్రెసును నిలిపేశారు. ఆదిలాబాదు జిల్లా ఖానాపూర్ లో మూడు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. హైదరాబాదులో బంద్ ప్రభావం పెద్దగా లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ ప్రభావం కాస్తా తక్కువగా ఉంది. వరంగల్ జిల్లాలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. మహబూబాబాద్ లో సంపూర్ణంగా బంద్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications