ఎన్టీఆర్ కుటుంబాన్ని పావుగా వాడుకోవద్దు: హరికృష్ణ

Harikrishna
హైదరాబాదు: స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులను పావులుగా వాడుకోవద్దని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సూచించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన శుక్రవారం ప్రసంగించారు. తాము నందమూరి వంశంలో పుట్టినవాళ్లమని, పార్టీ కోసం ప్రాణాలిస్తామని, తమను పావులుగా మాత్రం వాడుకోవద్దని ఆయన అన్నారు. సోదరి పురంధేశ్వరి పిలిచింది కాబట్టే బాలయ్య, ఇతర కుటుంబ సభ్యులం కారంచేడులోని ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారమని ఆయన వివరణ ఇచ్చారు. అది మా సొంత కార్యక్రమమని, అంతేతప్ప కాంగ్రెస్‌ మోచేతి నీళ్లు తాగాల్సిన గతి, గత్యంతరం తమకు లేదని ఆయన అన్నారు.

అన్నఎన్టీఆర్‌ ఆనాడు యువతకు అందించిన స్ఫూర్తి ఏది? పార్టీలో యువత నిద్రపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ఆయన అడిగారు. ఈ బానిస బతుకులు పోవాలంటే తెదేపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, పార్టీ జెండా గగనతలంలో ఎగరాలని, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసి మనం పండగ చేసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+