లాహోర్: పాకిస్తాన్ లోని లాహోర్ లో గల జిన్నా ఆస్పత్రిపై సోమవారం రాత్రి సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 12 మంది మరణించారు. మృతుల్లో నలుగురు పోలీసులు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. శుక్రవారం మసీదు దాడిలో గాయపడినవారు చికిత్స పొందుతున్న ఎమర్జెన్సీ వార్డుపై ముగ్గురు, నలుగురు సాయుధ మిలిటెంట్లు దాడి చేశారు.
తమను ఎదుర్కోవడానికి వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మిలిటెంట్లు రోగులను, ఆస్పత్రి సిబ్బందిని బందీలుగా తీసుకున్నారు. కొద్దిపాటి ఎదురుకాల్పుల తర్వాత మిలిటెంట్లు తప్పించుకున్నారు.