జూన్ 15 నుంచి వైయస్ జగన్ ఓదార్పు యాత్ర

కాగా, అధిష్టానం అనుమతి రాకున్నా జగన్ ఓదార్పు యాత్రను 15 నుంచి సాగించడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీ ఆదేశం మేరకు జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేసుకున్నారని, అందువల్ల జగన్ యాత్రకు అనుమతి ఇవ్వాలని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో సెంటిమెంట్ ఉంది కాబట్టి అక్కడ వద్దని తాము చెప్పామని, కోస్తాలో అటువంటిది లేనందున జగన్ కు అనుమతి ఇవ్వాలని, జగన్ పర్యటన వల్ల పార్టీ బలోపేతం అవుతుందని సీమాంధ్ర నేతలు అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications