హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక దొంగగా మారిన ఓ సినిమా దర్శకుడి ఉదంతం వెలుగు చూసింది. జల్లు సినిమా దర్శకుడు రఘునాథ్ రెడ్డి హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంటిలో చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశాడు.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతను భవనం పైనుంచి దూకాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.