ఉప ఎన్నికలు: కాంగ్రెసులో తెలంగాణ చిచ్చు

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తమ పార్టీయేననే ప్రధాన నినాదంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఉప ఎన్నికల్లోకి వెళ్లే ఉద్దేశంతో ఉన్నారు. ఈ పరిస్థితిలో అనంత వెంకటరామిరెడ్డి ప్రకటనపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సైతం గత ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెసుతోనే సాధ్యమని చెప్పారని తెలంగాణ నాయకులు గుర్తు చేస్తున్నారు. అలా చెప్పకపోతే పప్పులు ఉడకవని తెలంగాణ నాయకులు ఖరాఖండిగా చెప్పుతున్నారు. కాంగ్రెసులో ప్రారంభమైన ఈ వివాదం ముదిరి పాకాన పడే వాతావరణమే ఉంది.












Click it and Unblock the Notifications