హైదరాబాద్: ప్రభుత్వ ప్రజా భద్రతా సలహాదారు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర్ రావు పరోక్షంగా ధ్వజమెత్తారు. కొందరు ప్రభుత్వ సలహాదారులు ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, యువనేత వైయస్ జగన్ కు మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వారు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సీనియర్లను పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం అన్ని విషయాలను గమనిస్తోందని ఆయన అన్నారు.