విజయవాడ:
కనదర్గమ్మకు
మరో
బంగారు
కిరీటం
సమకూరింది.
తిరుమల
తిరుపతి
దేవస్థానం
పాలకమండలి
మాజీ
సభ్యురాలు
డాక్టర్
చదలవాడ
సుధ
దంపతులతో
పాటు
శ్రీ
దుర్గా
మల్లేశ్వరస్వామి
దేవస్థానం
పాలకమండలి
మాజీ
సభ్యులు
పెదర్ల
రాజబాబు
ఈ
కిరీటాన్ని
బహూకరించారు.
అమ్మవారి
ఉత్సవమూర్తికి
బంగారు
కిరీటం
లేదని
తెలుసుకున్న
వీరు
నగరంలోని
ముసద్దిలాల్
జ్యూయలరీలో
దీనిని
తయారు
చేయించారు.
ఉత్సవమూర్తికి
శోభను
చేకూర్చే
విధంగా
కిరీటం
రూపొందింది.
కిరీటం,
కర్ణాభరణాలకు
412
గ్రాముల
బంగారం
వినియోగించినట్లు
తయారీదారులు
తెలిపారు.
అమావాస్య
తర్వాత
మంచిరోజున
దేవస్థానం
అధికారులకు
దాతలు
కిరీటాన్ని
అందచేస్తారని
అర్చకులు
వివరించారు.