హుటాహుటిన గవర్నర్ తో డీకే శివకుమార్ భేటీ: ప్రమాణ స్వీకారం తేదీ మార్పు వెనుక

కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న వేళ.. ఉపముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఉదయం బెంగళూరులో లోక్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా అనంతరం రాష్ట్ర నాయకత్వ మార్పుపై రాజకీయ కోలాహలం మధ్య కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఈ ఉదయం సంజయ్ నగర లోని తన నివాసం నుంచి లోక్ భవన్ కు చేరుకున్నారు డీకే శివకుమార్. ఆ సమయంలో ఆయన వెంట మాజీ ఎంపీ. ఆయన సోదరుడు డీకే సురేష్, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. సుమారు అరగంటకు పైగా గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలేవీ ప్రస్తుతానికి వెల్లడి కావట్లేదు గానీ.. ఇది మర్యాదపూరక సమావేశంగా భావిస్తోన్నారు. సిద్ధరామయ్య రాజీనామా చేసినప్పుడు గవర్నర్ అందుబాటులో లేరు. దీంతో రాజీనామా తదుపరి పరిణామాలను డీకే శివకుమార్ గవర్నర్ కు వివరించారని తెలుస్తోంది.

All Eyes on Lok Bhavan as the DK Shivakumar Meets Governor Oath taking on June 3 New Chief Minister

నాయకత్వం మార్పుతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు ఈ సాయంత్రం 4 గంటలకు సీఎల్‌పి సమావేశం జరగనుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ గెహ్లాట్ శుక్రవారమే ఆమోదించారు. దీంతో మంత్రి మండలి తక్షణమే రద్దయింది. ఈ నేపథ్యంలో తమ తదుపరి నాయకుడిని ఎన్నుకోవడానికి సీఎల్పీ భేటీ కాబోతోంది. నిన్న రాత్రి వరకూ ఢిల్లీ పర్యటనలో తీరికలేకుండా గడిపారు డీకే శివకుమార్. సిద్ధరామయ్యతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు.

ఈ తెల్లవారు జామున ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. కాగా ఈ సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో ఈ భేటీ ఏర్పాటైంది. ఏఐసీసీ పరిశీలకులుగా కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా హాజరు కానున్నారు. ఎమ్మెల్యేల ద్వారా నూతన నాయకుడిని లాంఛనంగా ఎన్నుకునే ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం ఖరారైంది. జూన్ 3వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోధూళి ముహూర్తంలో శుభ యోగం, శుభ ఫలాలతో ఈ కార్యక్రమం జరగనుంది. డీకే శివకుమార్‌తో పాటు మరో 10 మంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ 10 మంది పేర్లను సోమవారం ఖరారు చేయనున్నారు.

నిజానికి సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఒంటరిగా ప్రమాణం చేయాలనుకున్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా 10 మంది మంత్రులను తీసుకోవాలనుకోవడం, పేర్లును ఖరారు చేయడం వంటి పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో ప్రమాణ స్వీకార తేదీని 2వ తేదీకి బదలాయించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+