హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీ ఈనాడు రాతలపై సాక్షి డైలీ మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ రాజకీయ కార్యకలాపాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తున్న కథనాలపై సాక్షి దినపత్రిక తీవ్రంగా మండిపడింది. పచ్చ పత్రికల పిచ్సి రాతలనే శీర్షికతో ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. వైయస్ జగన్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఆ పత్రికలు ఓ పనిగా పెట్టుకున్నాయంటూ నిప్పులు చెరిగింది. ఈనాడును ఓ పత్రికగా అభివర్ణిస్తూ, ఆంధ్రజ్యోతిని తోకపత్రికగా ఆ సాక్షి కథనం అభివర్ణించింది. వైయస్ జగన్ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపిలో చేరుతారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తాకథనాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పవార్ కు ఏం బలముందని ఎన్సీపిలో చేరుతారని, అంతకు ముందు బిజెపిలో చేరుతారంటూ రాసిన విషపుత్రిక ఇప్పుడు ఎన్సీపిలో చేరుతారంటూ ఎలా రాసిందని ఓ కాంగ్రెసు నాయకుడు అన్నట్లు సాక్షి వార్తా కథనం వ్యాఖ్యానించింది. పవార్ తో జగన్ జత కడతారంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తాకథనాన్ని చూసి కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు కడుపుబ్బ నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించింది.

ఈనాడుపై కూడా సాక్షి దినపత్రిక వార్తాకథనం దుమ్మెత్తిపోసింది. విజయవాడ నుంచి జగన్ రహస్యంగా రైల్లో హైదరాబాదు వచ్చారని ఈనాడు రాసిన వార్తాకథనాన్ని ప్రముఖంగా ఎత్తిచూపింది. జగన్ వచ్చింది రోడ్డు మార్గంలో అయితే ఈనాడు రైల్లో వచ్చినంటూ రాసిందని వ్యాఖ్యానించింది. జగన్ ను రోడ్డు మార్గంలో వస్తున్నప్పుడు తెలంగాణవాదులు నల్లగొండ జిల్లాలో అడ్డుకున్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన వార్తా కథనంపై నిప్పులు చెరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తా కథనాలను సాక్షి దినపత్రిక ఎల్లో సిండికేట్ క్షుద్ర రాతలుగా అభివర్ణించింది. పచ్చరాతలు అనడాన్ని తెలుగుదేశం అనుకూల పత్రికలు అని చెప్పడానికే. ఎల్లో సిండికేట్ చెప్పింది ప్రజలు నమ్మి ఉంటే చంద్రబాబు శాశ్వత సిఎంగా మిగిలేవారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X