హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో పోటీపై పునారాలోచన చేయాలి: దామోదర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయంపై పునరాలోచన చేయాలని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇక్కడి పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకుని పోవడంలో విఫలమైనందుకు బాధపడుతున్నామని ఆయన అన్నారు. పోటీ చేస్తే కాంగ్రెసుకు నష్టం జరుగుతుందని, విజయావకాశాలు కూడా తక్కువేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మరణించినవారి కుటుంబాలకు టికెట్లు ఇవ్వాలనే ప్రతిపాదన సరైంది కాదని ఆయన అన్నారు.

జలయజ్ఞంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ తమ పార్టీ సీనియర్ నాయకులు గవర్నర్ కలవడం అర్థరహితమని ఆయన అన్నారు. జలయజ్ఞంలో అవకతవకలు జరిగి ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోవడం సమంజసంగా ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్పందించుకుంటే అప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడడం సిఎల్పీ సంప్రదాయానికి విరుద్ధమని ఆయన అన్నారు. పార్టీ వద్దంటున్నా సీనియర్లు గవర్నర్ ను కలవడం వెనక రహస్య ఎజెండా ఉందనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. జలయజ్ఞంలో అక్రమాలకు సంబంధించి ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X